డిసెంబరు 16 2020

From Kailasapedia
Jump to navigation Jump to search

పేరు:

నిత్యానంద సత్సంగం ప్రత్యక్ష ప్రసారం || పరమశివోహం సీసన్ - 18

కధనం

వీడియో

Video Audio
EmbedVideo received the bad id "-" for the service "soundcloud".



సత్సంగం యొక్క తెలుగు అనువాద కధనం

16 డిసెంబర్ 2020 , బుధవారం 10 : 32 PM తెర తెరుచుకుంది. హిందూమత వున్నత గురువు , జగత్గురు మహాసన్నిదానం దైవస్వరూపులు భగవాన్ నిత్యానంద పరమశివం తో శక్తి పాద, శక్తిని పాద. 10 : 35 PM నుంచి 11 :07 వరకు - నిత్యానంద సత్సంగ్

  • శ్రీకైలాస నుంచి పరమశివుని సందేశం డైరెక్ట్ గా .
  • ప్రళయం యొక్క తీవ్రత అయిపోయింది.కానీ ప్రళయ కాలంలో తీసుకున్న నిర్ణయాలను అమలుచేయవద్దు.
  • మీరు ప్రళయ కాలంలో శారీరకంగా,మానసికంగా,చేతనస్థితిపరంగా కదలిపోయారు.
  • ఆ సమయంలో మీరు మీ జీవితం గురించి, మీ గురించి మీరు చాలా నిర్ణయాలు తీసుకుని వుంది వుంటారు.
  • అదంతా మానసికస్థితి నిలకడగా లేని స్థితి నుంచి.
  • ప్రళయ కాలంలో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడే మొదలుపెట్టవద్దు.
  • చాల జాగ్రత్తగా వుండండి.
  • ఇంకా కొన్ని రోజులు సర్దుకోనీయండి.తిరిగి మొదలుపెట్టవచ్చు. మీ ఇన్నర్ స్పేస్ ని శక్తివంతంగా తిరిగి నిర్మించుకోవచ్చు.
  • ప్రళయ కాలంలో మీ జీవితంలో మీరు తీసుకున్న నిర్ణయాలను మళ్ళిచూడండి.
  • చేతనస్థితిలో జీవన సానుకూలతకు మనస్సుని నిర్మించడం మొదలుపెట్టండి, అత్త్యుత్తమ చేతనస్థితి ఇన్నర్ స్పేస్ నిర్మాణము.
  • నేను సోషల్ మీడియా లో చాలా మెసేజ్ లు చూస్తున్నాను,ప్రతి చోట ప్రజలు ప్రళయ కాలంలో తీసుకున్న నిర్ణయాలనన్నిటిని అమలుచేస్తున్నారు.ప్రళయం మీకు ఇంకా పూర్తికాలేదు!
  • మీరు ప్రళయకాలంలో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు అమలుచేస్తే మీరు చాలా ఇబ్బందులలో పడతారు.
  • మీరు ఆ విషయం తెలుసుకోవాలి.
  • స్పష్టంగా వుండండి. మీరు ప్రళయకాలంలో తీసుకున్న నిర్ణయాలను ఎలా అమలుచేయడానికి మీ ఇన్నర్ స్పేస్ ఎలా ప్రయత్నిస్తుందో నేను మీకు వివరిస్తాను.ఇది ప్రళయం హ్యాంగోవర్ లాంటిది.
  • కాబట్టి స్పష్టంగా వుండండి. మీరు ఇప్పుడు శారీరకంగా చురుకుగా ఉండగలరు.మానసికంగా ప్రళయకాలంలో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు అమలు చేయవద్దు.
  • డిసెంబర్ 14 వరకు, మీరు తీసుకున్న నిర్ణయాలను అమలుచేయడానికి ప్రయత్నించవద్దు.కూర్చును మొత్తాన్ని తిరిగి చూడండి తాజాగా మొదలుపెట్టండి- మీ జీవితం గురించి, మీగురించి, మీ సంబందాలగురించి, మీ వ్యాపారం,మీ జీవనోపాధి.
  • కొత్తగా చూడటం మొదలుపెట్టండి మరియు నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టండి.
  • క్షేమంగా వుండండి- కనీసం 15 రోజులు- ఒక నెల స్థిరపడండి. మీలో విచ్చిన్నమైన వాటిని కలవడం చూస్తారు.
  • ఎక్కువ శాంతివంతంగా వుండండి. మీలోమీరు నమ్మకంతో వుండండి.
  • యునైటెడ్ నేషన్స్ 2021 వ సంవత్సరాన్ని అంతర్జాతీయ శాంతి మరియు నమ్మకం సంవత్సరంగా ప్రకటించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను.కాబట్టి అందరు మీలోపల మరియు ఇతరులతో శాంతిని, నమ్మకాన్ని పెంచుకోండి.మరియు కొత్త జీవితాన్ని సృష్టించుకోవడం,నిర్మించుకోవడం మొదలుపెట్టండి.
  • ఈ ప్రళయం మనకు చాలా పాఠాలను నేర్పించింది.మానవ నిర్మిత చట్టాలలో,సూత్రాలలో లోపాలను, నిజమైన విశ్వ విలువలను, విశ్వ సూత్రాలను
  • ప్రజలు విశ్వ విలువలను గ్రహించడం మొదలుపెడుతున్నారు.ధర్మ వేదఆగమాలు మరియు ధర్మ శాస్త్రాలు విశ్వ సూత్రాలమీద స్థాపించబడినవని అన్న విశ్వ సూత్రాల విలువలను గ్రహిస్తున్నారు,
  • ఈ ప్రళయం మొత్తం - కరోనా మహమ్మారి ఒక్కటే కాదు.2020 వ సంవత్సరంలో 100 పైగా దేశాలలో జాతీయ అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి.
  • చరిత్ర లో రికార్డు అయిన జాతీయ విపత్తులతో 2020 వ సంవత్సరం ఎక్కువ విపత్తులను చూసింది.
  • ఈ మహమ్మారి, ఈ ప్రళయం ఒక్క కరోనా గురించి మాత్రమే కాదు.ఇంకా చాలా విషయాలు వున్నాయి.కాబట్టి అర్ధం చేసుకోండి.ప్రకృతి విపత్తులు, మానవులు సృష్టించి విపత్తులు ఈసారి కలసి వచ్చాయి, మరియు మానవులు తయారుచేసిన చట్టాలు,మానవులు తయారుచేసిన ఆలోచనలు , మానవులు తయారుచేసిన సూత్రాలలో లోపాలను, అవి ఎంత భ్రమ కలిగిచేవో ,అవి యెంత పరిమితమో,అవి ఎంత చిన్నవో ,అవి ప్రపంచ సమస్యలను ఎలా తట్టుకోలేకపోతున్నాయో మానవులు గ్రహించాకలిగారు.
  • కాబట్టి దయచేసి అర్ధం చేసుకోండి. మనం ప్రపంచాన్ని అంతర్జాతీయం అని చూడటం మానేయాలి.ప్రపంచాన్ని " గ్లోబల్ " అని చూడటం మొదలుపెట్టాలి.
  • `అంతర్జాతీయయం` అంటే ప్రపంచాన్ని మానవుల తరఫునుంచి చూడటం.` గ్లోబల్` అంటే ప్రపంచాన్ని విశ్వం తరఫునుంచి చూడటం.
  • ఇప్పటినుంచి కైలాసలో మనం ` గ్లోబల్ ` అనే పదాన్ని,ఆలోచననే ఉపయోగించుదాము.
  • వచ్చే సంవత్సరం,2021 ని `గ్లోబల్ శాంతి మరియు విశ్వాసం సంవత్సరం ` గా కైలాస ప్రకటించింది.( GLOBAL YEAR OF PEACE AND TRUST )
  • ప్రపంచాన్ని గ్లోబల్ లాగా చూడటం వలన ఎక్కువ సమస్యలను పరిష్కరించ వచ్చు, మానవాళికి సహాయం , మద్దతు మరింత మంచి మార్గంలో చేయవచ్చు.
  • ప్రపంచ వ్యాప్తంగా మానవాళి ఎదుర్కుంటున్న సంక్షోభ సమస్యలను,కష్టాలను,అపాయాలను పరిష్కరించడానికి మనం వేద ఆగమాలలోని సూత్రాలను, విశ్వ సూత్రాలను, విశ్వ విలువలను ఉపయోగించవలసిన అవసరం వున్నది.
  • ప్రపంచాన్ని కేవలం వివిధ దేశాలుగా కాకుండా గ్లోబల్ కుటుంబం లాగా చూడవలసిన సమయం ఇదే.
  • నిర్ణయాలు ఆర్ధిక వ్యవస్థ గురించి కావచ్చు,వైద్యం గురించి నిర్ణయాలు కావచ్చు,,ప్రయాణాలు,రాజకీయాలు, జీవన ప్రాధమిక అవసరాలు,ఆహరం, దుస్తులు,ఆశ్రయం, ప్రాధమిక మానవ హక్కులు, ప్రతి స్థాయిలోను మనం వేద ఆగమాలు సంప్రదాయం నుంచి విశ్వ సూత్రాలను,విశ్వ ధర్మాలను,గ్లోబల్ సూత్రాలను ఎక్కువగా ఉపయోగించడం మొదలుపెట్టాలి.
  • జీవిత మీద,జీవితం యొక్క గ్లోబల్ సూత్రాలగురించి ఎక్కువ ద్రుష్టి ఉంచాలి.నేను పదే పదే చెప్పాను,హిందుత్వం అనేది పాశ్చాత్య నాగరికులు వివరించినట్లు కాదు.
  • హిందుత్వం అనేది గొప్ప ద్రుష్టి, విశ్వ సూత్రాలు కలిగిన గొప్ప శాస్త్రము.
  • హిందువులు అభినందించడానికి సమయం ఇదే.దీనిని అర్ధం చేసుకుని,ప్రపంచ వ్యాప్తంగా ప్రతిచోటా దీనిని ఉపయోగించాలి,ప్రపంచ వ్యాప్తంగా మానవులకు ఇప్పుడు ఉన్న అన్ని సమస్యలను,రాబోవు సమస్యలను పరిష్కరించడానికి దీనిని మన జీవన శైలి లాగా,మన సూత్రాల లాగా ఉపయోగించాలి.
  • భవిష్యత్తులో వచ్చే సమస్యలు గ్లోబల్ స్థాయిలో ఉండబోతున్నాయి.అది స్థానికంగా ఉండేది కాదు.అది మానవ నిర్మిత సమస్య కానీ, ప్రకృతి వైపరీత్యం కాని, ప్రపంచవ్యాప్తంగా జరగబోతుంది.గ్లోబల్ సమస్యలను పరిష్కరించడానికి గ్లోబల్ సూత్రాలను అనుసరించుదాము.
  • నేను ఈ రోజు రెండు సత్యాలను మాత్రమే బహిర్గతం చేయాలనుకుంటున్నాను.కాబట్టి మీరు ఈ రెండు సత్యాలను అంతర్గతీకరించుకోవచ్చు.
  • మొదటిది.ప్రళయ కాలంలో మీరు తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు అమలుచేయవద్దు. డిసెంబర్ 14 లోపు మీరు తీసుకున్న నిర్ణయాలు ప్రళయ ప్రభావం యొక్క విషపూరితంగా ఉంటాయి.
  • ఇప్పుడు స్థిరపడండి, మానసికంగా స్థిమితపడండి. మీ చేతనస్థితిలో లోతుగా పనిచేయండి.
  • ఇప్పుడు తిరిగి మొదలుపెట్టండి,మీ భవిష్యత్తుని తిరిగి నిర్మించుకోండి.
  • డిసెంబర్ 14 లోపు తీసుకున్న నిర్ణయాలను అమలుచేయకండి .
  • వచ్చే 15 రోజులనుంచి ఒక నెల రోజులవరకు స్థిరపడండి.
  • తిరిగి మొదలుపెట్టండి,తిరిగి నిర్మించండి,జీవిత సానుకూలతతో వుండండి. జీవితం గురించి,సంబందాలగురించి, ఆర్ధిక వ్యవస్థ గురించి, జీవనోపాధి,వ్యాపారం ప్రతిదాని గురించి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోండి.ప్రళయ కాలంలో తీసుకున్న నిర్ణయాలు అమలుచేయడానికి తొందరపడవద్దు. ఇది మొదటి విషయం
  • రెండవది. మానవ నిర్మిత చట్టాలు, మానవ నిర్మిత సూత్రాలు, మానవ నిర్మిత వ్యవస్థ యొక్క లోపాల గురించి ఈ ప్రళయం మానవజాతి అందరికి గుణపాఠం నేర్పించింది.
  • వేద ఆగమ సూత్రాలను, విశ్వ సూత్రాల సత్యాలను,విశ్వ విలువలను, ధర్మ శాస్త్రాలను ఈ గ్లోబల్ సమస్యలను,గ్లోబల్ సంక్షోభాలను,మిగిలిన గ్లోబల్ సమస్యలను అది మానవ నిర్మిత సమస్య కావచ్చు, లేదా ప్రకృతి వైపరీత్యం కావచ్చు,వాటిని పరిష్కరించడానికి ఉపయోగించడం మొదలు పెట్టె సమయం ఇది.
  • అది గ్లోబల్ వార్మింగ్ కావచ్చు,టెర్రరిజం,ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలడం,మారణహోమం, మానవ హక్కుల ఉల్లంఘన,ప్రళయం లేదా ఏదైనా .
  • గ్లోబల్ సమస్యలకు,మానవజాతి ఎదుర్కుంటున్న సంక్షోభాలకు వేద ఆగమ సంప్రదాయాలనుంచి విశ్వ విలువలను, విశ్వ సూత్రాలను ఉపయోగించుదాము.
  • కాబట్టి ఈ రెండు సూత్రాలమీద వాక్యార్ధ సదస్సు,మరియు జీవార్థ సదస్సు ఉండాలి.
  • వాక్యార్ధ సదస్సు ఎవరిద్వారానైనా చేయించవచ్చు. జీవార్థ సదస్సు ఆ సూత్రాలలో జీవిస్తున్న సన్యాసులద్వారా మాత్రమే జరగాలి.అదే తేడా.
  • ఇప్పటినుంచి,నేను బహిర్గతం చేసే ప్రతి విషయం , పరమశివ యొక్క ప్రతి సందేశానికి మనకు వాక్యార్ధ సదస్సు,మరియు జీవార్థ సదస్సులు ఉండాలి.
  • వాక్యార్ధ సదస్సు ఎవరిద్వారానైనా చేయించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ- కైలాసవాసులు అందరూ పాల్గొనవచ్చు.
  • జీవార్థ సదస్సు కైలాస ,ఆధీనంల లొపల నివసించే వారిద్వారా మాత్రమే జరగబడుతుంది.ఎవరైతే ఈ సూత్రాలతో జీవిస్తుంటారో వారు.
  • పరమశివ బహిర్గతం చేసే సూత్రాలను చూడండి,అది ఈ - కైలాసవాసులకు ఆధ్యాత్మిక సలహా,ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకోసం.కానీ కైలాసవాసులకు అది చట్టం.
  • పరమశివ సూత్రాలు ఎవరికైతే సలహాలు అవుతాయో ,వారందరూ వాక్యార్థ సదస్సు లో పాల్గొనవచ్చు.
  • కానీ ఎవరైతే దానిని వారి జీవితంలో చట్టం కింద తీసుకుంటారో , పరమశివ వెల్లడిచేసినవి వారి జీవిత చట్టం కింద తీసుకుంటారో , వారు జీవార్థ సదస్సులో పాల్గొనవచ్చు. కాబట్టి వాక్యార్థ సదస్సుకి, జీవార్థ సదస్సుకి అదే తేడా.
  • ప్రతిరోజు మనకు అవి రెండు ఉంటాయి.ప్రతిరోజు అన్ని సూత్రాలమీద VS మరియు JS ఉంటాయి.పరమశివుని చేత వెల్లడిచేయబడిన సత్యాలు.
  • కాబట్టి ఈ రెండు సూత్రాలమీద వాక్యార్థ సదస్సు,జీవార్థ సదస్సు మొదలుపెడదాము, ఈరోజు పరమశివ సందేశము.

Link to Facebook Page

https://www.facebook.com/ParamahamsaNithyananda/videos/1202345286827073
https://www.facebook.com/ParamahamsaNithyananda